డయాబెటిక్ డైట్: డయాబెటిస్ కోసం పరిపూర్ణమైన వంటపుస్తకం. Lindsay Shepard
Чтение книги онлайн.

Читать онлайн книгу డయాబెటిక్ డైట్: డయాబెటిస్ కోసం పరిపూర్ణమైన వంటపుస్తకం - Lindsay Shepard страница 12

СКАЧАТЬ పెళుసైనంత వరకు కొన్ని క్షణాలు అలాగే ఉంచండి, తర్వాత తీసివేసి, సర్వ్ చేయండి. వెజ్జీస్ లేదా తక్కువ కార్బ్ వున్న బ్రౌన్ రైస్‌తో ఆనందించండి.

      రుచికరమైన ఆలోచన #8: త్వరగా సులభంగా చేసే తక్కువ కార్బ్ గల చిప్స్

      ఎంతమందికి వడ్డించవచ్చు: 4

      వండడానికి పట్టే సమయం: 28 నుండి 34 నిమిషాలు

      కేలరీలు: 91.7

      కొవ్వులు: 8.1 గ్రా

      ప్రోటీన్లు: 3.2 గ్రా

      పిండి పదార్థాలు: 2.8 గ్రా

      మీకు కావలసిన పదార్థాలు:

       ఉప్పు (ఇష్టపడినంత)

       మిరియాలు (ఇష్టపడినంత)

       బేకన్ (స్లైసెస్, ఎనిమిది)

       నూనె (ఆలివ్, 18.5 గ్రా)

      తయారు చేయు విధానం:

      1 మొదటిగా, సుమారు 180 డిగ్రీల సెల్సియస్ వరకు ఓవెన్ ను సెట్ చేయండి

      2 తరువాత, నూనె (ఆలివ్) తో ట్రేని గ్రీజు చేయండి లేదా మీకు నచ్చిన నూనె ఏదైనా పర్వాలేదు. అప్పుడు, బేకన్‌ను చిన్నగా, కొరికేటంత-పరిమాణంలో వున్న ముక్కలుగా విడదీయండి

      3 తరువాత, మీ రుచికి తగినట్లు మిరియాలు & ఉప్పుతో సీజన్ చేయండి.

      4 ఆ తర్వాత, సుమారు పద్దెనిమిది నుండి ఇరవై ఒక్క నిమిషాలు ఓవెన్లో పెట్టండి. బయటకు తీసి చల్లబరచండి.

      5 పట్టుకొనేటంత చల్లగా అయిన తర్వాత, బిట్స్ తీసుకొని మీడియం ఫైర్ మీద స్కిల్లెట్ లేదా పాన్ లో ఉంచండి. ఈ ప్రక్రియ సాధారణంగా నాలుగు నుండి ఆరు నిమిషాలు పడుతుంది. మంట మీద నుండి తీసివేసి చిప్స్‌గా వడ్డించండి. మీరు తక్కువ కొవ్వు, తక్కువ కార్బ్ డిప్‌తో కలిపి ఆకలిపుట్టించే వంటకం వలె వడ్డించండి!

      రుచికరమైన ఆలోచన #9: నమ్మశక్యంగాని తక్కువ కార్బ్ వున్న సౌత్ ట్రీట్

image

      ఎంతమందికి వడ్డించవచ్చు: 3 నుండి 4

      వండడానికి పట్టే సమయం: 29 నుండి 32 నిమిషాలు

      కేలరీలు: 288

      కొవ్వులు: 22.3 గ్రా

      ప్రోటీన్లు: 18.9 గ్రా

      పిండి పదార్థాలు: 2.7 గ్రా

      మీకు కావలసిన పదార్థాలు:

       టర్కీకోడి చాతిభాగం (రోస్టు చేసింది, 225 గ్రా, చాప్ చేసింది)

       చీజ్ (పర్మేసన్, 75 గ్రా)

СКАЧАТЬ