Название: ముఖ మొటిమల చికిత్స
Автор: Owen Jones
Издательство: Tektime S.r.l.s.
isbn: 9788835423461
isbn:
కలబంద అనేది ఒక మొక్క, దీన్ని ప్రభావిత ప్రాంతంపై నేరుగా మీకు నచ్చినంత తరచుగా రుద్దవచ్చు. ఇది చాలా చల్లగా హాయిగా అనిపించేలా చేస్తుంది. మందపాటి ఆకును త్రుంచి, దాని పైనున్న చర్మం కొంచెం తొలగించి, లోపల ఉన్న జెల్లీని మీ చర్మంపై రుద్దండి. మీరు తాజా కలబందను ఒక్కసారి ఉపయోగించారంటే, తర్వాత ఎప్పుడూ షాపులో కొన్న కలబందను ఉపయోగించాలని మీరు ఆశపడరు.
నిమ్మరసం ఒక క్రిమినాశకి మరియు చాలా హాయినిస్తుంది. ఒక నిమ్మకాయ నుండి రసం పిండి, ఆ రసాన్ని మెత్తని బట్టపై పోసి, ఆ బట్టతో మీ ముఖాన్ని తుడవాలి. నిమ్మరసం మొటిమల బ్యాక్టీరియాను చంపడమే కాదు, అదనపు నూనెను కూడా తొలగిస్తుంది. సాధారణ వెనిగర్ కూడా ఇలాగే పనిచేస్తుంది.
హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు విచ్ హాజెల్ రెండూ కూడా మలినాలను శుభ్రపర్చే పదార్థాలే, దుకాణంలో కొన్న నివారణ మందుల కంటే చౌకైనవి మరియు మంచివి. మళ్ళీ, ఈ వస్తువుల గాఢతలను (సాంద్రతలను) బట్టి వీటితో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వాటిని, ముఖ్యంగా పెరాక్సైడ్ ను బహుశా పల్చగా చేయాల్సి రావచ్చు.
మొటిమలకు ఇంకా అనేక గృహ నివారణోపాయాలు ఉన్నాయి, వీటిలో చాలా వరకు ఖరీదైన రసాయనాల మాదిరిగానే పనిచేస్తాయి, సమస్య నిజంగా ఏమిటో గుర్తుంచుకోండి (నూనె మరియు బ్యాక్టీరియా) మరియు వాటికి చికిత్స చేసే మార్గాల కోసం చూడండి. రోజ్మేరీని వేడి నీటిలో వేసి, చల్లబర్చి వాడితే కూడా వెల్లుల్లి వలె క్రిమినాశక మందుగా పనిచేస్తుంది, అయినప్పటికీ СКАЧАТЬ